వైసీపీకి ఇచ్చిన సీట్లు మాకివ్వండి... సీమను అభివృద్ధి చేసి చూపిస్తాం: నారా లోకేశ్

  • బద్వేలు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • నబియాబాద్ లో రైతులతో ముఖాముఖి
  • టీడీపీ అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటామని భరోసా
రాయలసీమలో 49 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే జగన్ రాయలసీమకి ఇచ్చింది ఏంటి? వైసీపీకి 2019 లో ఇచ్చిన సీట్లు మాకు ఇవ్వండి రాయలసీమని అభివృద్ది చేసి చూపిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాయలసీమ రైతులకు నీరు ఇస్తే బంగారం పండిస్తారు, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. 

బద్వేలు నియోజకవర్గం నబియాబాద్ లో రైతులతో ముఖాముఖి సమావేశమైన లోకేశ్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ... జగన్ పాలనలో రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందులతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. 

విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల రేట్లు పెరిగిపోయాయని తెలిపారు. రాయలసీమకి జీవనాడి డ్రిప్ ఇరిగేషన్... అలాంటి డ్రిప్ పై సబ్సిడీ ఎత్తేసి నాలుగేళ్లలో రైతులకి జగన్ తీరని అన్యాయం చేశాడని ఆరోపించారు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే బాధ్యత నాది

బద్వేల్ లో టీడీపీ జెండా ఎగరేయండి... పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జ్ పనులు పూర్తి చేసే బాధ్యత నాది. జగన్ సొంత బ్రాండ్లు అమ్ముకోవడానికి చెరుకు రైతులను వేధిస్తున్నాడు. బెల్లం అమ్మడానికి వీలు లేదని అక్రమ కేసులు పెడుతోంది జగన్ ప్రభుత్వం. గతంలో ఎలా అయితే స్వేచ్ఛగా బెల్లం అమ్ముకునే వారో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్వేచ్ఛగా రైతులు బెల్లం అమ్ముకునే అవకాశం కల్పిస్తాం. 

బద్వేల్ నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తీర్చడానికి పిల్ల కాలువలు తవ్వుతాం. మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాయలసీమలో హార్టి కల్చర్ ని ఎక్కువగా ప్రోత్సహిస్తాం. 

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తాం. మామిడి, దానిమ్మ, బొప్పాయి, చీనీ, కర్జూరం ఇలా వీటిలో అనేక రకాల మొక్కలు ఇక్కడే పెంచే విధంగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.

జ్యూస్ ఫ్యాక్టరీలు రప్పిస్తాం

జూస్ ఫ్యాక్టరీలు రావడానికి కావాల్సిన రకాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటాం. పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి యువత వ్యవసాయం వైపు వచ్చేలా చేస్తాం. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, సెరీ కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. 

సోమశిల ప్రాజెక్టు ముంపు బాధితులకు అన్యాయం జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తాం. మొదటి 18 నెలల్లో పరిహారం అందిస్తాం. బద్వేల్ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అదనంగా మరో 80 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కుందూ ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.

పులివెందులకు కూడా నీళ్లిచ్చాం

రాయలసీమ ప్రాజెక్టుల కోసం టీడీపీ ఖర్చు చేసింది 11,700 కోట్లు . అందులో 10 శాతం కూడా జగన్ ప్రభుత్వంలో ఖర్చు చెయ్యలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తు కు గ్యారెంటీ పేరుతో అన్నదాతకు రూ.20 వేల ఆర్ధిక సాయం చేస్తాం. ఒకే సంతకంతో రూ.50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేసింది చంద్రబాబు గారు. 

టీడీపీ ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ, రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది. హార్టి కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించింది చంద్రబాబు. పులివెందులకు నీళ్లు ఇచ్చింది చంద్రబాబు. 175 నియోజకవర్గాలు మాకు సమానం అంటూ అభివృద్ది చేశాం. పంటల బీమా పక్కగా అమలు చేసింది టీడీపీ.

జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యలు

జగన్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే నెంబర్ 3 గా ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 2 గా ఉంది. టీడీపీ హయాంలో ఒక్కో రైతు మీద రూ.75 వేల అప్పు ఉంటే జగన్ పాలనలో రూ.2.50 లక్షలకు చేరింది. ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి కోర్టు దొంగ. పంట నష్టం జరిగితే, జగన్ ప్రభుత్వంలో కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు లేదు. 

గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం ద్వారానే శాశ్వతంగా సాగునీటి సమస్య తీరుతుంది. లోవర్ సీలేరు ప్రాజెక్టుని ఆధునీకరణ చేస్తానని జగన్ బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా హామీ ఇచ్చి మోసం చేశాడు. ముంపునకు గురై భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటాం.

వైకాపా ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిల!

పెన్నానది నుంచి ఇసుక రవాణా చేసేందుకు వెళ్తున్న టిప్పర్లను పరిశీలించిన లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "వైసీపీ ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిలలాడుతోంది. పత్రికలు ఘోషిస్తున్నా, ప్రజలు మొరపెట్టుకుంటున్నా వైసీపీ ఆగడాలు ఆగడం లేదు.

ఇవి బద్వేలు నియోజకవర్గంలోని లింగాలకుంట వద్ద పెన్నానది ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్ లారీలు. ఇసుక లోడ్ చేసుకున్నాక ఎక్కడికి తీసుకెళ్తారని అడిగితే బెంగుళూరు వెళతామని డ్రైవర్ సమాధానమిచ్చారు. ఇక్కడ ఇసుక కూతవేటు దూరంలోని గ్రామప్రజలకు దొరకదు కానీ, చెన్నయ్, బెంగుళూరులో మాత్రం విరివిగా దొరుకుతుంది. జలగన్న పాలనలో జనం ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలో!" అంటూ చురకలంటించారు.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1569.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 12.4 కి.మీ.*

*124వ రోజు పాదయాత్ర వివరాలు (12-6-2023):*

*బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):*

సాయంత్రం

4.00 – బద్వేలు శివారు విద్యానగర్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – బద్వేలు విద్యానగర్ లో స్థానికులతో సమావేశం.

4.30 – ఎన్ జిఓ కాలనీలో స్థానికులతో మాటామంతీ.

4.45 – సిఎస్ఐ చర్చి వద్ద క్రిస్టియన్లతో సమావేశం.

5.00 – బద్వేలు ఆర్టీసి బస్టాండు వద్ద బహిరంగసభ. నారా లోకేశ్ ప్రసంగం.

6.15 –నాలుగురోడ్ల జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.

7.00 – బద్వేలు పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

8.00 – గోపవరం శ్రీనివాసపురంలో స్థానికులతో మాటామంతీ.

10.30 – పిపి కుంటలో స్థానికులతో సమావేశం.

10.45 – పిపి కుంట శివారు విడిది కేంద్రంలో బస.

******


More Telugu News