విద్యా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

  • భావి తరాల విద్యావిధానాల కోసం వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
  • వర్కింగ్ గ్రూప్ లో నిపుణులు, ఉన్నతాధికారులకు చోటు
  • ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
రాష్ట్ర విద్యాశాఖకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాల విద్యా విధానాల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది. ఈ వర్కింగ్ గ్రూప్ లో నిపుణులు, ఉన్నతాధికారులు ఉంటారు. తదుపరి తరం టెక్నాలజీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ల అమలుకు ఈ వర్కింగ్ గ్రూప్ కృషి చేస్తుంది. ఈ గ్రూప్ ఏర్పాటుపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ గా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. కన్వీనర్ గా విద్యాశాఖ కమిషనర్... అశుతోష్ చద్దా (మైక్రోసాఫ్ట్ ఇండియా), షాలిని కపూర్ (అమెజాన్ వెబ్ సర్వీసెస్), శ్వేతా కరుణ (ఇంటెల్ ఆసియా), జై జీత్ భట్టాచార్య, అర్చన జి గులాటీ తదితరులు సభ్యులుగా వ్యవహరిస్తారు.


More Telugu News