బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు!
- ఆసుపత్రిలో చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న నందమూరి బాలకృష్ణ
- కేక్ కట్ చేసి, చిన్నారులకు బహుమతుల అందజేత
- ఈ పుట్టిన రోజు వేడుకలు తన బాధ్యతను మరోసారి గుర్తు చేశాయని వ్యాఖ్య
- తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని పేర్కొన్న బాలయ్య
హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో శనివారం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రిలో క్యాన్సర్‌తో పోరాడున్న చిన్నారుల మధ్య బాలయ్య తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించిన బాలయ్య, వారికి బహుమతులు కూడా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.
అనంతరం కార్యక్రమానికి హాజరైన సిబ్బంది, వైద్యులు, రోగులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ పుట్టిన రోజు వేడుకలు తన బాధ్యతలను మరోసారి గుర్తు చేశాయని తెలిపారు. భూమ్మీద మహానుభావులు కొందరే ఉంటారని, తాము సమాజానికి ఎలా ఉపయోగపడతామా అని వారు ఆలోచిస్తారని చెప్పారు. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తి అని బాలయ్య అన్నారు. ముఖ్యమంత్రిగా, నటుడిగా, ఆసుపత్రి వ్యవస్థాపకునిగా ఎన్టీఆర్ ఎన్నో గొప్ప పనులు చేశారని, వారి అడుగుజాడల్లోనే తాను నడవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తన తండ్రి పేద వారికి అందుబాటు ధరలలో నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నెలకొల్పిన ఈ ఆసుపత్రి ఎందరికో ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా దృక్పధంతో సేవలు అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ నిరంతరాయంగా ఈ సేవలు అందించేందుకు కృషి చేస్తానని బాలయ్య ప్రకటించారు.
ఈ కార్యక్రమాలలో ట్రస్టు బోర్డు సభ్యులు జెయస్ ఆర్ ప్రసాద్, సీఈఓ డా. ఆర్ వి ప్రభాకరరావు, ఆసోసియేట్ డైరెక్టర్ డా. కస్పనా రఘునాథ్, మెడికల్ సూపరింటెండెంట్, మెడికల్ ఆంకాలజీ విభాగం హెడ్ డా. సెంథిల్ రాజప్ప, రేడియాలజీ విభాగం హెడ్ డా. వీరయ్య చౌదరితో పాటూ ఇతర వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది, రోగులు, వారి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.