పేపర్ లీకేజీ నిందితులు పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతి
- నిందితులకు గ్రూప్ 1 పరీక్షల హాల్ టిక్కెట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
- నిందితులను పరీక్షకు అనుమతించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యానికి నో
- షమీమ్, సురేష్, రమేష్, సుస్మితలకు హాల్ టిక్కెట్లు!
ప్రశ్నాపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్-1 పరీక్షలు రాయడానికి హాల్ టిక్కెట్లు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నిందితులు ఈ పరీక్షలు రాసేందుకు తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలుకు వెళ్లింది. నలుగురు నిందితుల్ని పరీక్షకు అనుమతించాలని శుక్రవారం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.
దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో విచారణ జరిగింది. పరీక్షకు అనుమతించి... ఫలితాలు ప్రకటించవద్దన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. నిందితులు షమీమ్, సురేష్, రమేష్, సుష్మితలకు హాల్ టిక్కెట్లు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ అప్పీలును కొట్టివేసింది.