గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసేవారికి టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు
- 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం పరీక్ష
- 994 పరీక్ష కేంద్రాలు సిద్ధం
- పావు గంట ముందే గేట్లు క్లోజ్ చేస్తారని సూచన
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు రాసేవారికి టీఎస్‌పీఎస్సీ సూచనలు చేసింది. 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. ఇందుకు 994 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. 3 లక్షల ఎనభై వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు రాసేవారికి టీఎస్‌పీఎస్సీ పలు సూచనలు చేసింది.
పరీక్ష ప్రారంభ సమయానికి పావు గంట ముందే గేట్లు మూసి వేస్తారని, అందుకే అంతకు ముందుగానే రావాలనీ తెలిపింది. పరీక్ష కేంద్రంలోనికి వాచీలు, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు అనుమతించమని తెలిపింది. అభ్యర్థులు షూలు ధరించవద్దని, చెప్పులు మాత్రమే వేసుకోవాలని స్పష్టం చేసింది. వైట్ నర్, చాక్ పౌడర్, బ్లేడ్, ఎరేజర్ తో బబ్లింగ్ చేస్తే కనుక ఓఎంఆర్ షీటు చెల్లదని తెలిపింది.