'అదితి' దేవో భవ అంటూ కొద్దిగా క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్!

'అదితి' దేవో భవ అంటూ కొద్దిగా క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్!
  • నటి అదితి రావు హైదరీతో సిద్ధార్థ్ సాన్నిహిత్యం
  • కొన్నాళ్లుగా జంటగా షికార్లు
  • ఓ టీవీ షోలో సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్య
భారతీయ సంస్కృతిలో అతిథి దేవో భవ అంటారు. అయితే హీరో సిద్ధార్థ్  ఒక సందర్భంలో అతిథి దేవో భవ అనడానికి బదులు అదితి దేవో భవ అని అన్నాడు. తద్వారా తన డేటింగ్ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. 

అసలీ అదితి దేవో భవ ఏంటో చూస్తే... కొన్నాళ్లుగా సిద్ధార్థ్, అందాలభామ అదితి రావు హైదరీల చెట్టాపట్టాలేసుకుని షికార్లు చేస్తుండడం తెలిసిందే. తాము ప్రేమలో ఉన్నామని వారిద్దరిలో ఒక్కరూ ప్రకటించకపోయినా, వాళ్ల సాన్నిహిత్యం చూస్తే ఎవరైనా లవ్ అనుకోవాల్సిందే! 

ఇటీవల ఓ టెలివిజన్ షోకి హాజరైన సిద్ధార్థ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. లైఫ్ లాంగ్ మీతో కలిసి డ్యాన్స్ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అని యాంకర్ ప్రశ్నించించింది. అందుకు సిద్ధార్థ్ విచిత్రంగా బదులిచ్చాడు. "మీ ఊరిలో అదితి దేవో భవ అంటారు" అంటూ 'అదితి' పేరు వచ్చేలా పరోక్షంగా వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 

సిద్ధార్థ్, అదితి రావు హైదరీ గతంలో మహాసముద్రం సినిమాలో నటించారు. వీరిద్దరూ తరచుగా పబ్లిక్ లో జంటగా కనిపిస్తున్నప్పటికీ, డేటింగ్ విషయంలో మాత్రం నోరు విప్పడంలేదు.


More Telugu News