లిఫ్టులో చిక్కుకుపోయిన మంత్రి విడదల రజని, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్
- విశాఖ ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న విడదల రజని
- వైజాగ్ లో అక్రిడిటేటెడ్ జర్నలిస్టుల వైద్య శిబిరం
- ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రి విడదల రజని
- ఒక్కసారిగా ఆగిపోయిన లిఫ్టు
- ఎమర్జెన్సీ కీతో డోర్ తెరిచిన సిబ్బంది
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ లకు ఊహించని అనుభవం ఎదురైంది. మంత్రి విడదల రజని, అవంతి శ్రీనివాస్, కొందరు అధికారులు లిఫ్టులో చిక్కుకుపోయారు.
విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న విడదల రజని ఇవాళ వైజాగ్ లో అక్రిడిటేటెడ్ జర్నలిస్టుల వైద్య శిబిరం ప్రారంభించేందుకు విచ్చేశారు. ఓ ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విడదల రజని, మాజీ మంత్రి అవంతి, అధికారులు లిఫ్ట్ ఎక్కారు. అయితే ఆ లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో అందరిలో ఆందోళన నెలకొంది.
వెంటనే స్పందించిన డయాగ్నొస్టిక్ సెంటర్ సిబ్బంది ఎమర్జెన్సీ కీతో లిఫ్టు డోర్ తెరవడంతో మంత్రి తదితరులు బయటికి వచ్చారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్టు సామర్థ్యాన్ని మించి అందులోకి ఎక్కడంతో అది మొరాయించినట్టు తెలుస్తోంది.