ప్రధాని మోదీ సన్నిహితుడ్ని పెళ్లాడిన మంత్రి సీతారామన్ కుమార్తె
- పీఎంవో కార్యాలయం ఓఎస్ డీ ప్రతీక్ దోషితో మూడు ముళ్లు
- బెంగళూరులో నిరాడంబరంగా జరిగిన వివాహం
- అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో వేడుక
- రాజకీయ నేతలకు లేని ఆహ్వానం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె పరకాల వాంగ్మయి, ప్రతీక్ దోషి వివాహం గురువారం బెంగళూరులో అతి సాధారణంగా జరిగింది. కేవలం అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో జరిగిన ఈ వివాహం వీడియో, ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రధాని మోదీ సహా రాజకీయ నాయకులు ఎవరికీ ఆహ్వానం లేకుండా వివాహం నిర్వహించడంతో అందరిలోనూ దీనిపై చర్చ మొదలైంది. అసలు ప్రతీక్ దోషి ఎవరనే ఆసక్తి నెలకొంది.
ప్రతీక్ దోషి ప్రధానమంత్రి కార్యాలయం ఉద్యోగి. ఆయన స్వరాష్ట్రం గుజరాత్. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడని పేరు. జాయింట్ సెక్రటరీ ర్యాంక్ (ఐఏఎస్) లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్ డీ) కింద ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో పనిచేస్తున్నారు. 2019 జులైలో ఈ బాధ్యతల్లో దోషి నియమితులయ్యారు. ఆయన నెలవారీ వేతనం రూ.1,57,600. సింగపూర్ మేనేజ్ మెంట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదివారు. ఎన్నో ముఖ్యమైన అంశాల్లో ప్రధానమంత్రికి నివేదికలు, మార్గదర్శకం అందిస్తుంటారు.
ఇక పరకాల వాంగ్మయి మల్టీమీడియా జర్నలిస్ట్ గా పనిచేస్తోంది. మింట్ లాంజ్ కు ప్రస్తుతం సేవలు అందిస్తోంది. గతంలో ద హిందూకి కూడా పనిచేసింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ తర్వాత.. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ లో మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.