దివ్యాంగులకు వచ్చే నెల నుంచి రూ.4116 పింఛన్: శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్
- ప్రస్తుతం దివ్యాంగుల పింఛన్ రూ.3116
- రూ.1000 పెంచుతున్నట్లు సీఎం వెల్లడి
- మంచిర్యాల బీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రకటన
తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారి పింఛన్ మొత్తాన్ని రూ.3116 నుండి రూ.4116కు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మాట్లాడారు. వికలాంగులకు పింఛన్ ను రూ.1000 పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో వారి పింఛన్ రూ.4116కు చేరుకుంటుంది.
ముసలమ్మలు, ముసలి తాతలు ఆసరా పెన్షన్లతో బ్రహ్మాండంగా ఉన్నారన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో వికలాంగుల పింఛన్ పెంచుతున్నట్లు చెప్పారు. మంచిర్యాల గడ్డ నుండి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి దీనిని ప్రకటించాలని తాను సస్పెన్షన్ లో పెట్టినట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి వారికి రూ. 4,116 పింఛన్ అందుతుందన్నారు. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నామన్నారు.