కృతి సనన్-ఓం రౌత్ ముద్దు వ్యవహారంపై స్పందించిన టీవీ 'రామాయణం' సీత
- శ్రీవారి దర్శనం అనంతరం సమీపంలో కృతి-ఓం రౌత్ ముద్దు
- ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దీపికా చిక్లియా
- సీతమ్మ తల్లి... భావోద్వేగాలకు సంబంధించిన అంశమని వ్యాఖ్య
తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్‌కు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ముద్దుపెట్టడంపై రామాయణం టీవీ సీరియల్ నటి, సీత పాత్రధారి దీపికా చిక్లియా తీవ్రంగా స్పందించారు. కృతి, ఓం రౌత్ తీరును ఆమె ఆక్షేపించారు. నేటి తరం నటులు సీతామహాదేవిని కేవలం పాత్రగానే చూస్తున్నారని, భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోతున్నారని వాపోయారు.
కృతి ఈ తరం నటి అని, ఇప్పుడున్న రోజుల్లో ముద్దు పెట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం సాధారణమేనని, ఆమె తనని తాను ఒక సీతమ్మ తల్లిగా అనుకున్నట్లుగా లేదని, ఇది భావోద్వేగాలకు సంబంధించిన విషయమన్నారు. అప్పట్లో తాను సీత పాత్రలో జీవించానని, ఇప్పటి తరం నాయకులు సీతమ్మను కేవలం పాత్రగానే భావిస్తున్నారని, కానీ తమ రోజుల్లో అలా కాదన్నారు. తాము రామాయణం సీరియల్ లో నటిస్తున్న సమయంలో పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేవారమన్నారు. ఎంతోమంది తమ పాదాలకు నమస్కారం చేసేవాళ్లన్నారు. తమను నటీనటులుగా కాకుండా దేవుళ్లుగా భావించేవారన్నారు. తాము ఎవరినీ ఆలింగనం చేసుకునే వాళ్లం కాదన్నారు.