ఒడిశా రైలు ప్రమాదం: మృతదేహాలు ఉంచిన స్కూల్ భవనం కూల్చివేత... ఎందుకంటే..!
- కొన్ని రోజుల పాటు శవాగారంగా మారిన బహంగా హైస్కూల్
- స్కూల్ కు వచ్చేందుకు భయపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
- భవనం కూడా పాతబడిందని తెలిపిన యాజమాన్యం
- ఈ కారణాలతో హైస్కూల్ నూ కూల్చిన ఒడిశా ప్రభుత్వం
ఒడిశాలోని బాలేశ్వర్ లో ట్రిపుల్ ట్రైన్ ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను బహంగాలోని ఓ హైస్కూల్ లో తాత్కాలికంగా ఉంచారు. మూడు నాలుగు రోజుల పాటు ఈ పాఠశాల శవాగారంగా మారింది! ఆ తర్వాత ఇక్కడి మృతదేహాలను భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత స్కూల్ ను శుభ్రం చేశారు. కానీ ఈ పాఠశాలలోకి రావడానికి విద్యార్థులు భయపడుతుండటంతో దీనిని కూల్చివేశారు.
ఇక్కడ ఒకేచోట మృతదేహాలను చూసి స్థానికులు భయానికి గురవుతున్నారు. ఈ ప్రదేశానికి రావడానికే జంకుతున్నారు. ఈ స్కూల్ ను 16వ తేదీన తిరిగి ఓపెన్ చేయనున్నారు. అయితే ఈ పాఠశాలకు రావడానికి విద్యార్థులు ధైర్యం చేయడం లేదని, వారి తల్లిదండ్రులు కూడా చిన్నారులను పంపించేందుకు నిరాకరిస్తున్నారని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. అంతేకాదు అరవై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం కూడా పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. దీంతో ఈ స్కూల్ ను కూల్చివేయాలని పాఠశాల యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది.
బాలాసోర్ జిల్లా కలెక్టర్ గురువారం ఈ స్కూల్ ను పరిశీలించారు. అనంతరం కూల్చివేతకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో శుక్రవారం ఈ భవనాన్ని కూల్చి వేశారు. ఇదే చోట కొత్త భవనాన్ని నిర్మిస్తామని, అప్పుడు విద్యార్థులు వస్తారని స్కూల్ యాజమాన్యం చెబుతోంది.