కృష్ణా జిల్లా వీఆర్ఓ మీనాకు అభినందనలు: నారా లోకేశ్
- మీనా పామర్రు మండలంలో అక్రమ మట్టి లారీలను అడ్డుకుందన్న లోకేశ్
- మండుటెండలో, 10 నెలల బిడ్డతో వెళ్లి లారీలను అడ్డుకుందని వివరణ
- విధి నిర్వహణలో మీనా నిబద్ధత స్ఫూర్తిదాయకమని వెల్లడి
కృష్ణా జిల్లాకు చెందిన మీనా అనే వీఆర్ఓను అభినందిస్తున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. మీనా పామర్రు మండలం పసుమర్రులో మట్టి లారీలను అడ్డుకున్నారని వెల్లడించారు. ఆ లారీల్లో అక్రమంగా ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. మీనా ఎంతో ధైర్యంగా ఆ లారీలను అడ్డుకున్నారని కొనియాడారు. మండుటెండలో 10 నెలల చంటిబిడ్డతో వెళ్లి లారీలను అడ్డుకోవడం మాటలు కాదన్నారు. విధి నిర్వహణలో వీఆర్ఓ మీనా నిబద్ధత స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.