సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ

  • ఏపీలో జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం
  • ఎండలు ఇంకా మండిపోతున్నాయన్న అనగాని
  • వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఏసీ రూముల్లోంచి బయటికి రావడంలేదని వ్యాఖ్య 
  • పిల్లలు స్కూలుకు ఎలా హాజరవుతారన్న టీడీపీ ఎమ్మెల్యే
టీడీపీ శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్ కు లేఖ రాశారు. జూన్ 12న స్కూళ్లు ప్రారంభించాలన్న నిర్ణయంపై పునరాలోచించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనగాని తన లేఖలో తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లకు హాజరైతే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఎండవేడిమి తట్టుకోలేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఏసీ రూముల్లోంచి బయటికి రావడంలేదని అనగాని సత్యప్రసాద్అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలు స్కూళ్లకు ఎలా వస్తారని ప్రశ్నించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12 నుంచి స్కూళ్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.


More Telugu News