మాగుంట రాఘవకు షాక్.. బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న రాఘవ
  • రాఘవకు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేసిన సుప్రీంకోర్టు
  • ఈ నెల 12న సరెండర్ కావాలని రాఘవకు ఆదేశం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది. ఈ నెల 12న సరెండర్ కావాలని ఆదేశించింది. 

తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆమెను చూసుకోవడానికి ఎవరూ లేరని, అందువల్ల ఆమెను చూసుకోవడం కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో రాఘవ పిటిషన్ వేశారు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే, హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఈడీ ఆశ్రయించింది. బెయిల్ కోసం రాఘవ చూపించిన కారణాలు సహేతుకమైనవి కాదని పిటిషన్ లో కోరింది.


More Telugu News