గుడివాడ గొట్టంగాడు గెలవలేడు.. పులివెందుల పులి జగన్ కాదు: బుద్ధా వెంకన్న
- పులివెందుల పులి సునీత అన్న వెంకన్న
- సుప్రీంకోర్టులో అవినాశ్ కేసు విచారణ ఉన్నందునే గుడివాడ పర్యటనను జగన్ రద్దు చేసుకున్నారని ఎద్దేవా
- కేశినేని నాని సంగతిని అధిష్ఠానం చూసుకుంటుందని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ ఎంపీ కేశినేని నానిలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. పులివెందుల పులి జగన్ కాదని... వైఎస్ సునీత పులివెందుల పులి అని అన్నారు. సుప్రీంకోర్టులో ఈరోజు వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు అంశానికి సంబంధించిన పిటిషన్ పై విచారణ ఉన్నందునే గుడివాడ పర్యటనను జగన్ రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ పై నుంచి వచ్చి ప్రచారం చేసినా ఈసారి గుడివాడ గొట్టంగాడు గెలవలేడని అన్నారు. వైసీపీ గొట్టంగాళ్లు చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు.
ఇదిలావుంచితే, టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇటీవల మాట్లాడుతూ, తన లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న టీడీపీ ఇన్చార్జీలంతా గొట్టంగాళ్లు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ... ఎవరు ఏం విమర్శించినా తొందరపడనని చంద్రబాబుకు మాట ఇచ్చానని... అందుకే కేశినేని వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించనని చెప్పారు. తన మాటలు పార్టీకి నష్టం కలిగించకూడదనే మౌనంగా ఉన్నానని తెలిపారు. కేశినేని వ్యాఖ్యల సంగతిని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు.