ఆనంద్ మహీంద్రాకు నచ్చే అందమైన పల్లెలు ఇవి..!
- ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా
- బంగారు వర్ణంలో మెరిసిపోతున్న హిమాచల్ ప్రదేశ్ లోని కల్ప
- వీటిని చూసి మాటలు రావడం లేదన్న పారిశ్రామికవేత్త
మన దేశంలో ప్రకృతి అందాలకు కరువే లేదు. కొంత ఖర్చు పెట్టుకోగలిగి, ప్రయాణించే ఓపిక ఉంటే చాలు. దేశం నలుమూలలా కొలువై ఉన్న ప్రకృతి అందాలు, అద్భుత అందాలతో అలరారే పల్లెలను చుట్టేసి రావచ్చు. అద్భుతమైన, అరుదైన విషయాలను పంచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తనకు నచ్చిన ఓ పది గ్రామాల వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దేశంలోని అందమైన పది పల్లెల వివరాలను కలర్స్ ఆఫ్ భారత్ పేరుతో ఉన్న ట్విట్టర్ పేజీలో ఫొటోలతో సహా పోస్ట్ చేశారు. దీన్ని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో రీ పోస్ట్ చేశారు.
ఈ పల్లెలు పర్వత ప్రాంతాలు, పచ్చని చెట్ల మధ్య కొలువై ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని కల్ప అయితే బంగారం వర్ణంలోని పర్వతాల పక్కన ఉంటుంది. దేశంలో చివరి గ్రామంగా పిలిచే ఉత్తరాఖండ్ లోని ‘మన’ గ్రామం ఎత్తయిన పర్వతాల మధ్య కొలువై ఉంటుంది. అలాగే, రాజస్థాన్ లోని ఖిమ్సార్ గ్రామం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పది పల్లెలను ప్రకృతి ప్రేమికులు తప్పకుండా ఇష్టపడతారు. ‘‘మన చుట్టూ ఉన్న అందాలు చూసి నాకు మాటలు రావడం లేదు. భారత్ లో నాకు నచ్చే ఇష్టమైన ప్రాంతాల బకెట్ నిండి పొర్లిపోతోంది’’ అని ఆనంద్ మహీంద్రా తన భావాలను పంచుకున్నారు.