ఉన్నట్టుండి గుండె ఆగిపోతోంది ఎందుకు?: పరిశోధించనున్న ఐఐటీ కాన్పూర్

  • డ్యాన్స్ చేస్తుండగా, జిమ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ లు
  • కరోనా తర్వాత పెరిగిపోయిన ఇలాంటి కేసులు
  • వీటి వెనుక కారణాలను గుర్తించనున్న పరిశోధకులు
టీనేజీ, యుక్త వయసులోనే గుండెలు ఆగిపోతున్నాయి. డ్యాన్స్ చేస్తుంటేనో.. జిమ్ లో కసరత్తులు చేస్తుంటేనో గుండె ఆగిపోయి మరణిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? గతంలో లేనంతగా పెరిగిపోయిన ఈ హఠాత్ గుండె వైఫల్యాలకు కారణం ఏంటి? దీనిపై ఐఐటీ కాన్పూర్ పరిశోధన నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి ఇలాంటి గుండె వైఫల్య మరణాల గురించి ఎక్కువగా వింటున్న విషయం తెలిసే ఉంటుంది. ఇందుకు సంబంధించి వీడియోలు పదుల సంఖ్యలో వెలుగు చూశాయి. 

దీనిపై ఐఐటీ కాన్పూర్ విస్తృతమైన పరిశోధన చేయనుంది. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలసి దీన్ని నిర్వహించనుంది. గుండె మరణాలపై ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్న వారిని ఆహ్వానించనుంది. ఐఐటీ కాన్పూర్ లో ఏర్పాటవుతున్న గంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ కేంద్రం ఇలాంటి హార్ట్ ఎటాక్ లకు గల కారణాలను గుర్తించడంలో సాయం అందించనుంది. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు సంకేతాలను గుర్తించి, అప్రమత్తం చేసే వ్యవస్థను కూడా రూపొందించనున్నారు.


More Telugu News