టెస్టు క్యాచుల్లో రహానే ‘శతకం’.. ఏడో ఇండియన్‌గా రికార్డు

  • పాట్‌కమిన్స్ క్యాచ్‌ అందుకుని రికార్డులకెక్కిన రహానే
  • 209 క్యాచ్‌లతో అగ్రస్థానంలో రాహుల్ ద్రవిడ్
  • రెండో స్థానంలో మహేల జయవర్ధనే
టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే మరో రికార్డును తన పేర వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ క్యాచ్ అందుకున్న రహానే.. టెస్టుల్లో 100 క్యాచ్‌లు అందుకున్న ఏడో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 209 క్యాచ్‌లతో రాహుల్ ద్రవిడ్ ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 205 క్యాచ్‌లతో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్థనే తర్వాతి స్థానంలో ఉన్నాడు. 

లండన్‌లోని కింగ్స్‌టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు నిన్న రెండోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రహానే 29, శ్రీకాంత్ భరత్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.


More Telugu News