గడప గడపలో భాగంగా గ్రామానికి ఎమ్మెల్యే.. సైకిల్ రావాలి పాటతో హోరెత్తించిన గ్రామస్తులు
- వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మొగిలివారిపల్లెలో షాక్
- గ్రామంలో ‘సైకిల్ రావాలి’ పాటను హోరెత్తిస్తూ గ్రామస్తుల నిరసన
- మా గ్రామానికి ఏం చేశారంటూ ఎమ్మెల్యేకు సూటి ప్రశ్న
‘గడప గడపకూ’ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఓ గ్రామంలో వింత పరిస్థితి ఎదురైంది. కొందరు గ్రామస్తులు ‘టీడీపీ' పాటలను మైకుల్లో హోరెత్తించారు. ఎన్టీఆర్ శతజయంతి నేపథ్యంలో గ్రామంలో ఉత్సవ తోరణాలు, టీడీపీ జెండాలు, గోడల నిండా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పోస్టర్లు కనిపించాయి. ‘సైకో పోవాలి, సైకిల్ రావాలి’ పాట కూడా హోరెత్తించడంతో ఎమ్మెల్యే అసహనానికి గురయ్యారు. గురువారం బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో ఈ పరిస్థితి ఎదురైంది.
ఈ పాటలను ఆపాలని అధికార పార్టీ నాయకులు సూచించినా గ్రామస్తులు వినలేదు. ‘‘మా గ్రామానికి ఏం చేశారు? ఇప్పుడెందుకు వచ్చారు’’ అంటూ కారులో ఉన్న ఎమ్మెల్యేను నిలదీశారు. చివరకు, పోలీసుల జోక్యంతో గ్రామస్తులు పాటలను నిలిపివేశారు. అనంతరం, ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, గ్రామంలో మొత్తం 90 ఇళ్లు ఉండగా ఎమ్మెల్యే కేవలం రెండు ఇళ్లల్లోనే కరపత్రాలు పంపిణీ చేసి వెనుదిరిగారు. కాగా, ఈ నిరసనల్లో ముగ్గురిపై పోలీసు కేసు నమోదైంది.