పాక్‌పై ఒకటో రెండో సర్జికల్ దాడులు చేయాలి.. పంజాబ్ గవర్నర్ వ్యాఖ్య
- పంజాబ్ రాష్ట్రం సరిహద్దు జిల్లాల్లో గవర్నర్ భన్వరీలాల్ పర్యటన
- భారత్‌లోకి అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న పాక్‌పై గుస్సా
- దాయాది దేశానికి గుణపాఠంగా ఒకటో రెండో సర్జికల్ దాడులు చేయాలని వ్యాఖ్య
భారత్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు తరలిస్తున్న పాక్‌కు గుణపాఠం చెప్పేందుకు ఒకటో రెండో సర్జికల్ దాడులు చేయాలని పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ వ్యాఖ్యానించారు. గురువారం సరిహద్దు జిల్లాల్లో పర్యటించిన ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. భావితరాలు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ఎలాగైనా సరే అడ్డుకోవాలని అన్నారు. భారత్‌లోకి మాదకద్రవ్యాలు చొప్పిస్తూ పాకిస్థాన్ భారత్‌తో ‘పైకి కనిపించని’ యుద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు. భారత్‌తో నేరుగా తలపడలేకే ఈ చర్యలకు పూనుకుంటోందని విమర్శించారు. డ్రగ్స్ తరలింపునకు డ్రోన్స్ వాడకంపైనా గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, మాదకద్రవ్యాల అక్రమ తరలింపు కట్టడికి పంజాబ్ పోలీసులు కేంద్ర బలగాల సాయంతో చేపడుతున్న చర్యలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), ఆర్మీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు డ్రగ్స్ సమస్యను నివారించేందుకు గొప్ప సమన్వయంతో పనిచేస్తున్నాయని కితాబునిచ్చారు.