ఉత్కంఠను పెంచుతున్న 'ధూమం' .. తెలుగు ట్రైలర్ రిలీజ్!

  • మలయాళంలో రూపొందిన 'ధూమం'
  • 'యూ టర్న్' డైరెక్టర్ నుంచి వస్తున్న మరో సినిమా 
  • క్రైమ్ టచ్ తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ 
  • ఈ నెల 23న ఐదు భాషల్లో విడుదల
ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా మలయాళంలో 'ధూమం' సినిమా రూపొందింది. 'కేజీఎఫ్' .. 'కాంతార' వంటి సంచలన విజయాలను అందించిన హోంబలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. 'యూ టర్న్' దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన తమిళ ... తెలుగు .. కన్నడ .. హిందీ భాషల్లోను విడుదల చేయనున్నారు.
 
కన్నడ దర్శకుడు మలయాళంలో ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఐదు భాషల్లోను కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. క్రైమ్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా కనిపిస్తోంది. డబ్బు .. కిడ్నాప్ .. పోలీసులు .. ఛేజింగ్స్ నేపథ్యంలో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఫాహద్ ఫాజిల్ జోడీగా అపర్ణ బాలమురళి నటించింది. మిగతా పాత్రలలో రోషన్ మాథ్యూ ... అచ్యుత్ కుమార్ ... అనూ మోహన్ .. వినీత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.




More Telugu News