'విమానం'లో సుమతి పాత్ర చేయడానికి కారణమదే: అనసూయ
- రేపు విడుదలవుతున్న 'విమానం'
- శివప్రసాద్ యానాల దర్శకత్వం
- ప్రధానమైన పాత్రను పోషించిన సముద్రఖని
- ఇది అంగీకరించడానికి కారణం, కథ .. సముద్రఖని అన్న అనసూయ
ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ బేస్డ్ కథలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఏ మాత్రం ఎమోషన్స్ ఉన్నా కనెక్ట్ అవుతున్నారు. అలాంటి ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే 'విమానం'. జీ స్టూడియోస్ - కిరణ్ కొర్రపాటి కలిసి నిర్మించిన ఈ సినిమాకి, శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించాడు. సముద్రఖని .. అనసూయ .. ధన్ రాజ్ .. మాస్టర్ ధృవన్ ప్రధానమైన పాత్రలను పోషించారు.
ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. తాజాగా జరిగిన టీమ్ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ .. "డైరెక్టర్ గారు కథ చెప్పగానే ఈ సినిమాలో నేను తప్పకుండా భాగమవ్వాలి అనిపించింది. సాధారణంగా ఒక పాత్రకి ఒప్పుకోవాలంటే డేట్స్ ఎలా కావాలి .. నిడివి ఎంత .. రెమ్యునరేషన్ ఎంత? అనేవి ఆలోచన చేస్తుంటారు. నేను మాత్రం అవన్నీ పక్కన పెట్టేస్తాను. ఆ కథ నాకు ఎంతవరకూ నచ్చింది అని మాత్రమే ఆలోచన చేస్తాను" అని అన్నారు.
"ఒకవేళ కథ నచ్చితే .. అందులో నేను ఎంత కొత్తగా కనిపిస్తాను? నా పాత్రలో ఉన్న కొత్తదనం ఏమిటి? అనే విషయాలపై దృష్టిపెడతాను. ఎమోషన్స్ తో కనిపించాలా .. గ్లామరస్ గా కనిపించాలా అనేది కాదు. నా పాత్ర ఎంటర్టయినింగ్ గా ఉందా లేదా అనేది చూస్తాను. ఈ సినిమాలో నేను సుమతి పాత్ర చేయడానికి అంగీకరించడానికి కారణం, కథ .. సముద్రఖని గారు" అంటూ చెప్పుకొచ్చారు.