ఎంత చురుగ్గా ఉండాలో చెప్పిన ఆనంద్ మహీంద్రా

  • ప్రతి చర్యలు చురుగ్గా ఉంచుతాయన్న పారిశ్రామికవేత్త
  • చేసే పని మనస్ఫూర్తిగా ఉండాలని సూచన
  • సందేశాత్మక వీడియోని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
ఒక చిన్న ఇమేజ్, ఓ వీడియో క్లిప్ ఎంతో బలమైన సందేశాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. దృశ్యాలకు ఉన్న శక్తి అటువంటిది. ఓ నీటి కొలను వద్ద నీరు తాగుతున్న జింకపై మొసలి చేసే దాడికి సంబంధించిన వీడియోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీపై పంచుకున్నారు. తద్వారా కీలక సందేశాన్ని ఇవ్వాలన్నది ఆయన అభిమతం. 

నీరు తాగుతుండగా, మొసలి ఒక్కసారిగా దానిపైకి దూకుతుంది. కానీ, జింక కూడా చాలా వేగంగా స్పందిస్తుంది. అక్కడి నుంచి చెంగున గెంతి వెళ్లిపోతుంది. చేసేది లేక మొసలి తిరిగి మడుగులోకి వెళ్లిపోతుంది. ‘‘ప్రతిచర్యలు వాటిని చురుగ్గా ఉంచుతాయి. వారాన్ని మనస్ఫూర్తిగా ప్రారంభించడం అనేది సద్గుణం’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. చురుగ్గా ఉండాలని, చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలనేది ఆనంద్ మహీంద్రా ఇచ్చే సందేశం. జింక ఏ మాత్రం అలసత్వం, బద్ధకం, మొక్కుబడి చూపించినా మొసలికి ఆహారంగా మారిపోయేది. కానీ, తన పనిలో అది శ్రద్ధ చూపిస్తూ, అదే సమయంలో చురుగ్గా ఉండడం వల్లే బతికి బయటపడింది.


More Telugu News