విజయ్ దేవరకొండతో విభేదాలపై స్పందించిన అనసూయ
- విజయ్ వేదరకొండ, తాను లోగడ స్నేహితులేమనన్న అనసూయ
- ప్రేక్షకులతో బూతు పదాలు మాట్లాడించడం పట్ల అభ్యంతరం
- విజయ్ ప్రచారకర్త తనను దుర్భాషలాడుతూ పోస్ట్ లు పెట్టారని వెల్లడి
నటుడు విజయ దేవరకొండ, ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మధ్య విభేదాలు అభిమానులకు పరిచయమే. సామాజిక మాధ్యమాలపై అనసూయను లక్ష్యంగా చేసుకుని విజయ్ దేవరకొండ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, కామెంట్లు, దూషణలతో విరుచుకుపడడం తెలిసిందే. దీంతో ఖుషీ సినిమా పోస్టర్ పై విజయ్ దేవరకొండ పేరు ముందు 'ద' అని పేర్కొనడాన్ని పైత్యంగా అనసూయ అభివర్ణించింది. ఈ అంశాలపై అనసూయ భరద్వాజ్ తన స్పందనను ఓ మీడియా సంస్థతో పంచుకుంది.
‘‘విజయ్, నేను లోగడ స్నేహితులమే. అప్పుడు ఏ సమస్యా లేదు. అర్జున్ రెడ్డి (2017) విడుదల అయిన తర్వాతే పరిస్థితి మారింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ బూతులను మ్యూట్ చేశారు. విజయ్ ఓ థియేటర్ ను సందర్శించినప్పుడు వాటిని ఆన్ స్క్రీన్ పై వేశారు. వాటిని పలకాలని విజయ్ దేవరకొండ అభిమానులను కోరాడు. వారు ఆ బూతు పదాలను మాట్లాడారు. విజయ్ సినిమాలో ధూషించే పాత్రను పోషించాడు. సినిమా వరకు బాగానే ఉంది. కానీ, నిజ జీవితంలో ప్రేక్షకులను ఆ పదాలు పలికేలా ప్రోత్సహించడం ఏంటి? ఓ తల్లిగా ఇలాంటి అసభ్యకర పదాలు నన్ను బాధిస్తాయి. నేను దీనిపై విజయ్ తో మాట్లాడాను. నిజజీవితంలో వాటిని ప్రోత్సహించొద్దని కోరాను’’ అని అనసూయ వివరించింది. ఆన్ లైన్ లో మహిళలను యువత దూషించడం పెరిగిపోయినట్టు అనసూయ పేర్కొంది.
విజయ్ దేవరకొండ తండ్రి 2019లో 'మీకు మాత్రమే చెప్తా' సినిమాని నిర్మిస్తున్న సమయంలో తనకు పాత్రను ఆఫర్ చేసినట్టు అనసూయ తెలిపింది. ‘‘విజయ్ ప్రచారకర్త తనను దర్భాషలాడుతూ పోస్టులు పెట్టినట్టు అతడి బృందానికే చెందిన ఒకరు నాకు చెప్పారు. ప్రచారకర్త పెయిడ్ ట్రోల్స్ చేస్తున్నప్పుడు దానిపై విజయ్ కు అవగాహన ఉంటుంది కదా? అతడికి తెలియకుండా వారు ఇలాంటివి చేయరని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని అనసూయ తన ఆవేదన వ్యక్తం చేసింది.