వచ్చే 48 గంటల్లో బలపడనున్న బిపర్‌జోయ్ తుపాను

  • గోవాకు పశ్చిమ నైరుతిగా 860 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం
  • మున్ముందు మరింత బలపడనున్న తుపాను
  • లక్షద్వీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్రపై ప్రభావం
బిపర్‌జోయ్ తుపాను వచ్చే 48 గంటల్లో తీవ్ర తుపానుగా మారి వచ్చే మూడు రోజుల్లో వాయవ్యం దిశగా కదలనున్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అనుకూల పరిస్థితులు ఉండడంతో మున్ముందు ఇది మరింత తీవ్రరూపం దాల్చనుందని పేర్కొంది. బిపర్‌జోయ్ గోవాకు పశ్చిమ నైరుతిగా 860, ముంబైకి నైరుతి దిశగా 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్యం దిశగా కదులుతూ బలపడనుంది. 

తుపాను బలపడనున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సన్నద్దమైంది. ఈ నెల 14 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతంలో రేపటి నుంచి 11వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావం లక్షద్వీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్రపై ఉంటుందని వివరించింది.


More Telugu News