పవన్ కల్యాణ్ పై కామెంట్ చేసిన కోట శ్రీనివాసరావుపై నట్టి కుమార్ ఫైర్!
- రోజుకు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానన్న పవన్ కల్యాణ్
- ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడా ఇలాంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదన్న కోట
- కోట ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు కాబట్టి పవన్ ను తప్పుపట్టారా? అని ప్రశ్నించిన నట్టి
సినిమాలలో తాను రోజుకు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, పవన్ ప్రకటనను సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తప్పుబట్టారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు సైతం ఏనాడూ తాము ఎంత తీసుకుంటున్నామనే విషయాన్ని వెల్లడించలేదని... కోట్లు తీసుకుంటున్నానని పవన్ కల్యాణ్ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కోట శ్రీనివాసరావుపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత నట్టి కుమార్ కూడా కోటను తప్పుపట్టారు.
పవన్ కల్యాణ్ నిజాయతీగా ఎంత తీసుకుంటున్నాను, ఎంత ట్యాక్స్ కడుతున్నాను అనే విషయాన్ని చెప్పారని నట్టి కుమార్ ప్రశంసించారు. ఆయన నిజాయతీగా ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ఎంత తీసుకుంటున్నాడనే విషయాన్ని చెప్పారని అన్నారు. కోట ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు కాబట్టి పవన్ ను తప్పుపట్టారా? అని మండిపడ్డారు. కోట రోజుకు మూడు, నాలుగు షిఫ్ట్ లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఫంక్షన్ లో మైక్ ఇచ్చారు కదా అని ఏదో ఒకటి వాగేయడమేనా? అని దుయ్యబట్టారు. నిర్మాత ఇబ్బంది పడుతున్నప్పుడు కోట ఎంత ఇబ్బంది పెట్టారో తనకు తెలుసని చెప్పారు. కోటకు వయసు పెరిగిపోయిందని... ఆయన హద్దుల్లో ఉంటే మంచిదని సూచించారు. పవన్ ఒకరికి రూపాయి ఇచ్చే వ్యక్తే కానీ, ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదని నట్టి కుమార్ అన్నారు.