చాట్‌జీపీటీతో టీచర్‌ను బురిడి కొట్టించబోయిన 7వ తరగతి స్టూడెంట్!
- చాట్‌జీపీటీ సాయంతో 7వ తరగతి విద్యార్థి హోం వర్క్
- చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం యథాతథంగా కాపీ
- ఏఐ మోడల్‌గా తనకు వ్యక్తిగత అభిప్రాయం ఉండదన్న వాక్యం కూడా రాసేసిన విద్యార్థి
- చివరకు టీచర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వైనం
- తన మేనల్లుడి తప్పును సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్
చాట్‌జీపీటీతో టీచర్‌ను బురిడీ కొట్టించబోయిన 7వ తరగతి విద్యార్థి చివరకు అడ్డంగా దొరికిపోయాడు. తన మేనల్లుడు ఎలా బుక్కయ్యాడో చెబుతూ ఓ నెటిజన్ నెట్టింట షేర్ చేసిన కథనం ప్రస్తుతం వైరల్‌గా మారింది. టీచర్ ఇచ్చిన హోం వర్క్‌ను ఆ విద్యార్థి చాట్‌జీపీటీ సాయంతో పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఓ ప్రశ్నకు చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాన్ని యథాతథంగా తన హోం వర్క్‌లో రాసుకొచ్చాడు.
‘ఓ లాంగ్వేజ్ మోడల్‌గా, నాకు వ్యక్తిగత అంచనాలు లేదా అభిప్రాయాలు ఉండవు’ అన్న చాట్‌జీపీటీ మాటలను కూడా తన హోం వర్క్‌లో రాసేశాడు. దీంతో, సమాధాన పత్రంలోని ఆ వ్యాక్యాన్ని టీచర్ హైలైట్ చేసింది. దాని తాలూకు స్క్రీన్‌షాట్‌ను ఓ నెటిజన్ నెట్టింట పెట్టడంతో అది తెగ వైరల్ అవుతోంది. కుర్రాడి పొరపాటు చూసి నెటిజన్లు పడిపడీ నవ్వుకుంటున్నారు.