రష్యాలో చిక్కుకున్న భారతీయులకు ఊరట!
- సాంకేతిక సమస్యతో రష్యాలో ఎయిర్‌ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- మరో విమానంలో నేడు అమెరికాకు భారతీయుల తరలింపు
- భారతీయుల సౌకర్యార్థం అదనపు సిబ్బందిని రంగంలోకి దింపిన ఎయిర్ ఇండియా
రష్యాలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా దిగడంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు నేడు మళ్లీ తమ గమ్యస్థానాలకు ప్రయాణం ప్రారంభించారు. రష్యా నుంచి మరో ఎయిర్ ఇండియా విమానంలో నేడు అమెరికాకు బయలుదేరారు.
మంగళవారం ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్‌సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ సాంకేతిక సమస్య కారణంగా రష్యాలోని మాగడాన్‌లో అత్యవసరంగా దిగిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులతో పాటూ 16 మంది సిబ్బంది ఉన్నారు. రష్యాలో దిగాక అక్కడి సిబ్బంది వారికి తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. అయితే, సరైన ఆహారం లేక, స్థానికులతో భాషాపరమైన సమస్యల కారణంగా భారతీయ ప్రయాణికులు, ముఖ్యంగా చిన్నారులు అసౌకర్యానికి లోనయ్యారు.
మరోవైపు.. రష్యాకు చేరుకున్న మరో ఎయిర్ ఇండియా విమానం తాజాగా భారతీయులతో అమెరికాకు బయలుదేరింది. శాన్‌ఫ్రాన్‌సిస్కోలో విమానం దిగాక ప్రయాణికులకు సాయపడేందుకు ఎయిర్ ఇండియా అదనపు సిబ్బందిని రంగంలోకి దింపింది.