డబ్ల్యూటీసీ ఫైనల్: ట్రావిస్ హెడ్ సెంచరీతో తొలి రోజు ఆసీస్ దే పైచేయి

  • ఓవల్ మైదానంలో పచ్చికతో కూడిన పిచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • తొలిరోజు చివరికి 3 వికెట్లకు 327 పరుగులు చేసిన ఆసీస్
  • క్రీజులో హెడ్ (146), స్మిత్ (95)
  • తేలిపోయిన భారత బౌలర్లు
డబ్ల్యూటీసీ ఫైనల్లో పచ్చికతో కళకళలాడుతున్న పిచ్ ను చూసి టీమిండియా బోల్తాపడినట్టే కనిపిస్తోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టుకు తొలి రోజు ఆటలో ఆశించిన ఫలితం దక్కలేదు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా... టీమిండియా బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించడం తొలి రోజు ఆటలో హైలైట్. హెడ్ 156 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్ తో 146 పరుగులు సాధించాడు. 

మరో ఎండ్ లో స్టీవ్ స్మిత్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలిచాడు. స్మిత్ 95 పరుగులతో క్రీజులో ఉన్నాడు. స్మిత్ 14 బౌండరీలు కొట్టాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43, మార్నస్ లబుషేన్ 26 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0) ఆట ఆరంభంలోనే వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 1, మహ్మద్ సిరాజ్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.


More Telugu News