బీఆర్ఎస్ లో చేరిన మధ్యప్రదేశ్ సామాజిక కార్యకర్త ఆనంద్

  • వ్యాపమ్ స్కామ్ ను వెలుగులోకి తీసుకు వచ్చిన ఆనంద్ రాయ్
  • ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం
  • బీఆర్ఎస్‌కు జై ఆదివాసీ యువశక్తి సంఘటన్ మద్దతు
మధ్యప్రదేశ్ కు చెందిన సామాజిక కార్యకర్త, వ్యాపమ్ స్కామ్ ను వెలుగులోకి తీసుకు వచ్చిన ఆనంద్ రాయ్ భారత రాష్ట్ర సమితిలో చేరారు. ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనంద్ రాయ్ ఆర్టీసీ, ట్రైబల్ రైట్స్ యాక్టివిస్ట్ గా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. 

మధ్యప్రదేశ్ లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న జై ఆదివాసీ యువశక్తి సంఘటన్ అనే ప్రముఖ గిరిజన హక్కుల వేదిక బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఆనంద్ రాయ్ ఈ సంస్థలో కీలక నేతగా ఉన్నారు. ఆయనతో పాటు ఈ హక్కుల వేదిక ప్రస్తుత అధ్యక్షుడు లాల్ సింగ్ బర్మ తదితరులు కూడా బీఆర్ఎస్ లో చేరారు.


More Telugu News