సిద్ధూ జొన్నలగడ్డ చేతులమీదుగా 'ఇంటింటి రామాయణం' ట్రైలర్ రిలీజ్!

  • ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'ఇంటింటి రామాయణం'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • కామెడీకీ .. ఎమోషన్స్ కి పెద్దపీట 
  • ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల
'ఇంటింటికి ఒక కథ ... మా ఇంటికి ఒక కథ' అనే నానుడి ఉంది. అలాంటి ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే 'ఇంటింటి రామాయణం'.  సురేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ - నవ్య స్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

టైటిల్ ను బట్టే ఇది కామెడీని .. ఎమోషన్స్ ను కలుపుకుంటూ నడిచే కథ అనే విషయం అర్థమవుతోంది. మదీన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ - ప్రసాద్ ఐమ్యాక్స్ నిర్వహించారు.  

'డీజే టిల్లు' హీరో సిద్ధూ జొన్నలగడ్డ చేత ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. లవ్ ... కామెడీ సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వెంకట్ - గోపీచంద్ నిర్మించిన ఈ సినిమాలో .. నరేశ్ .. గంగవ్వ .. బిత్తిరి సత్తి .. ముఖ్యమైన పాత్రలను పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి.



More Telugu News