ప్రమాదం జరిగిన 5 రోజుల తర్వాత షాలిమార్ నుండి బయల్దేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

  • నిర్ణీత సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరిన కోరమాండల్ 
  • షాలిమార్ స్టేషన్ లో 2వ ప్లాట్ ఫామ్ పైకి రాగానే నిండిపోయిన జనరల్ కంపార్ట్‌మెంట్స్
  • 51 గంటల్లోనే రెండు ప్రధాన రైల్వే మార్గాల పునరుద్ధరణ
షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఐదు రోజుల తర్వాత, బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ స్టేషన్ నుండి బయలుదేరింది. నిర్ణీత సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. గత శుక్రవారం ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో ట్రిపుల్ ట్రైన్ ప్రమాదం పెను విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.

ఇక షాలిమార్ స్టేషన్ లో ఈ రైలు ప్లాట్‌ఫామ్ 2లో ఆగిన వెంటనే జనరల్ కంపార్ట్‌మెంట్లలోకి ఎక్కడానికి ఎంతోమంది ప్రయాణికులు ఉండటంతో పెనుగులాట జరిగింది. వెంటనే రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు పూర్తిగా నిండిపోయాయి. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రెండు ప్రధాన మార్గాలను రైల్వే సిబ్బంది అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇతర రైళ్లు ప్రమాదం జరిగిన మూడో రోజునే ఆ ట్రాక్ పైన ప్రయాణించాయి.


More Telugu News