రష్యాలో ఎయిరిండియా ప్రయాణీకుల ఇబ్బంది
- భాషా సమస్య, విభిన్న ఆహారం, అరకొర వసతితో ప్రయాణికుల ఇబ్బంది
- ఒకే గదిలో ఎక్కువమంది నిద్రించాల్సిన పరిస్థితి
- మగడాన్ బయలుదేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానం
ఢిల్లీ నుండి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రష్యాలోని మగడాన్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ విమానంలో 216 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు అక్కడ భాషా సమస్య, విభిన్న ఆహారం, అరకొర వసతి తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రయాణికులను బస్సుల్లో వివిధ ప్రాంతాలకు పంపించినట్లుగా తెలుస్తోంది. కొంతమందికి పాఠశాలల్లో వసతి సౌకర్యం కల్పించారు. ఇక్కడి ఆహారం తినలేక, భాషా సమస్య ఎదుర్కొని ఇబ్బంది పడుతున్నారట. పిల్లలతో ఉన్న ప్రయాణికులైతే సరైన సౌకర్యాలు లేక మరింతగా ఇబ్బంది పడుతున్నారు. ఒకే గదిలో ఎక్కువమంది నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు, ప్రయాణికులను శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలించేందుకు ముంబై నుండి బుధవారం ప్రత్యేక ఎయిరిండియా విమానాన్ని పంపించారు. ఈ విమానం గురువారం ఉదయం రష్యాకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఇందులో ప్రత్యేక బృందాన్ని కూడా పంపించామని, ఈ సిబ్బంది ప్రయాణికులకు సహాయం చేస్తుందని, అలాగే ప్రయాణికులకు సరిపడా ఆహారాన్ని పంపించామని చెప్పారు.