ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తాం: మంత్రి హరీశ్ రావు

  • సంగమేశ్వర ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి
  • ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని, రెండు పంటలు పండుతాయని వెల్లడి
  • కేసీఆర్ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందని వ్యాఖ్య
రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. దీనిని పూర్తి చేసి ఇక్కడి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని చిన్న చల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 21 రోజుల పండుగ చేసుకుంటున్నామన్నారు. నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ లు ఒకప్పుడు కరవు ప్రాంతాలు అని గుర్తు చేశారు. ఇప్పుడు రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పూర్తి చేసి నీళ్లిస్తామన్నారు. దీనిని పూర్తి చేశాక ఈ ప్రాంతంలో ప్రతి ఎకరం సస్యశ్యామలమవుతుందని, రెండు పంటలు పండుతాయన్నారు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు.

సింగూర్ నీళ్లు ఇక్కడి ప్రజల సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకే ఉపయోగపడేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామన్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలన్నారు. ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తామన్నారు.


More Telugu News