ముందస్తు ఎన్నికలపై మరింత స్పష్టత నిచ్చిన సీఎం జగన్
- సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం
- ఎన్నికలపై మంత్రివర్గ సహచరులకు సీఎం దిశానిర్దేశం
- షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
- రాష్ట్రంలో మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని సీఎం జగన్ వెల్లడి
ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపడంతోపాటు, మంత్రులకు ఎన్నికలపైనా సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏపీలో మరో 9 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని తెలిపారు. ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని వివరించారు. ఇప్పుడు శ్రమిస్తే గెలుపు మళ్లీ మనదే అవుతుందని మంత్రుల్లో విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరంలేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని సూచించారు.
చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరంలేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని సూచించారు.