వ్యక్తిగత వ్యాఖ్యలు చేసే నీచ సంస్కృతి నారా లోకేశ్ ది: లక్ష్మీపార్వతి

  • వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు, నారా లోకేశ్ ప్రవాసీలుగా మిగిలిపోతారన్న లక్ష్మీపార్వతి
  • లోకేశ్ చదువు, సంధ్య లేని మూర్ఖుడని ఎద్దేవా
  • చంద్రబాబు పర్మిషన్ తర్వాతే పవన్ వారాహి రోడ్డెక్కుతోందని విమర్శ
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు సమాధి కట్టడం ఖాయమని ఏపీ తెలుగు, సంస్కృతం అకాడెమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ నాలుగేళ్లుగా ఏపీకి వచ్చిపోతున్నారని... వచ్చే ఎన్నికల్లో ఓటమి తర్వాత వారు ప్రవాసీలుగా మిగిలిపోతారని అన్నారు.

నారా లోకేశ్ చదువు, సంధ్య లేని మూర్ఖుడని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పై పాదయాత్రలో లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేసే నీచ సంస్కారం లోకేశ్ దని విమర్శించారు. ఈవెనింగ్ వాక్ చేస్తే అది పాదయాత్ర కాదని ఎద్దేవా చేశారు. 

ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే పవన్ ప్రచార వాహనం వారాహి రోడ్డెక్కుతోందని అన్నారు. టీడీపీతో కలవడం వల్ల పవన్ కే నష్టమని చెప్పారు.


More Telugu News