SUVల్లో దూసుకుపోతున్న హ్యుందాయ్ క్రెటా

  • మే నెలలో 14,449 యూనిట్ల విక్రయాలు
  • అత్యధిక అమ్మకాలతో ఎస్ యూవీ విభాగంలో మొదటి స్థానం
  • 14,423 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో టాటా నెక్సాన్
  • మూడు, నాలుగో స్థానాల్లో మారుతి బ్రెజ్జా, టాటా పంచ్
స్పోర్ట్ యుటిలిటీ వాహనం (ఎస్ యూవీ) విభాగంలో హ్యుందాయ్ క్రెటా ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతోంది. మే నెలలో అత్యధిక యూనిట్లు అమ్ముడుపోయిన ఎస్ యూవీగా ఇది మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 14,449 యూనిట్లు అమ్ముడుపోయాయి. మిడ్ సైజ్ ఎస్ యూవీ విభాగంలో ఇదే ఇప్పుడు టాప్ మోడల్ గా రాణిస్తోంది. 

ఇక ప్యాసింజర్ వాహన విభాగంలో మే నెలలో మొత్తం 3,34,802 వాహనాలు అమ్ముడుపోతే.. ఇందులో 47 శాతం అమ్మకాలు ఎస్ యూవీలే కావడం గమనించొచ్చు. ఎక్కువ మంది ఎస్ యూవీలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు అర్థం అవుతోంది. ఎస్ యూవీ విభాగంలో పాప్యులర్ మోడళ్లు అయిన టాటా నెక్సాన్, మారుతి సుజుకీ బ్రెజ్జా, టాటా పంచ్ లను దాటుకుని క్రెటా పరుగులు పెడుతోంది.

క్రెటా తర్వాత ఎస్ యూవీ విభాగంలో రెండో టాప్ మోడల్ గా టాటా నెక్సాన్ నిలిచింది. మే నెలలో 14,423 యూనిట్ల నెక్సాన్ లు అమ్ముడయ్యాయి. క్రెటాతో పోలిస్తే 26 యూనిట్లు తక్కువగా నెక్సాన్ విక్రయాలు జరిగాయి. ఇక మారుతి సుజుకీ బ్రెజ్జా 13,398 యూనిట్లను విక్రయించింది. ఇది మూడో స్థానంలో ఉంది. టాటా పంచ్ 11,124 యూనిట్ల విక్రయాలతో ఎస్ యూవీ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది.


More Telugu News