బంగారంలో పెట్టుబడులకు ఇప్పుడు అనుకూలమేనా?
- ఇటీవలి కాలంలో ఊపందుకున్న బంగారం ధరలు
- రెండు నెలల్లో 10 శాతం పెరుగుదల
- పెట్టుబడులకు ఇది అనుకూల సమయం అంటున్న నిపుణులు
- మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి 10 శాతం వరకు కేటాయించొచ్చు
బంగారం కొనుగోళ్లు అన్నా, బంగారంలో పెట్టుబడులు అన్నా చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. బంగారం ధరల్లో ఇంత ర్యాలీ తర్వాత.. ఇంకా పెట్టుబడికి అవకాశాలున్నాయా? దీనిపై లాడర్7 వెల్త్ ప్లానర్స్ ఎండీ సురేష్ శడగోపన్ పలు సూచనలు చేశారు.
బంగారం ధరల్లో గత కొన్ని నెలల్లో మంచి కదలిక కనిపించింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లోనే పది శాతం ర్యాలీ చేయడం గమనించొచ్చు. 10 గ్రాముల ధర రూ.56,945 నుంచి రూ.62వేల దరిదాపుల్లోకి వచ్చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడులు సురక్షిత సాధనమైన బంగారంలోకి వెళుతున్నాయి. బంగారంలో పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. కాకపోతే ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయాలన్నది జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా పోర్ట్ ఫోలియోలో 5-10 శాతాన్ని బంగారానికి కేటాయించుకోవచ్చు’’ అని సూచించారు.
బంగారంలో పెట్టుబడి ఎప్పుడూ కూడా భౌతిక బంగారం కంటే డిజిటల్ రూపంలో ఉండడమే అనుకూలం. డిజిటల్ రూపంలో ఉంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన రిస్క్ ఉండదు. పైగా సావరీన్ గోల్డ్ బాండ్ లో ఇన్వెస్ట్ చేసి ఎనిమిదేళ్ల పాటు గడువు తీరే వరకు కొనసాగిస్తే లాభాలపై పన్ను ఉండదు. పెట్టుబడి విలువపై ఏటా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. స్టాక్ ఎక్సేంజ్ లలో ట్రేడ్ అయ్యే గోల్డ్ ఈటీఎఫ్ ల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. భౌతిక రూపంలోనే బంగారంపై పెట్టుబడి పెట్టే వారు ఆభరణాల కంటే, కాయిన్లు ఎంపిక చేసుకోవడం నయం.