జడేజా-అశ్విన్ కాంబోతో అద్భుతాలు: సచిన్ టెండూల్కర్

  • వీరిద్దరి సేవలను ఓవల్ మైదానంలో ఉపయోగించుకోవాలన్న సచిన్ 
  • మ్యాచ్ నడుస్తున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని వెల్లడి 
  • భారత బౌలర్లకు ఓవల్ చక్కని వేదిక అని పేర్కొన్న క్రికెట్ లెజెండ్
ఆస్ట్రేలియా, భారత్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ నేటి నుంచే ఓవల్ మైదానంలో మొదలు కానుంది. ఇక్కడ సీమర్లకు పిచ్ అనుకూలిస్తుంది. ఈ మైదానంలో టెస్ట్ మ్యాచుల్లో ఫలితం తేలే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు చూస్తే మూడింట రెండొంతులు డ్రాకే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ ఆస్ట్రేలియాపై విజయం సాధించడానికి ఏం చేయాలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు.

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సేవలను వినియోగించుకోవాలని సచిన్ పేర్కొన్నాడు. ‘‘ఓవల్ మైదానంలో ఆడుతున్నందుకు భారత్ జట్టు సంతోషంగా ఉంది. ఓవల్ మైదానం మ్యాచ్ నడుస్తున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కనుక స్పిన్నర్లకు కొంత మొగ్గు ఉంటుంది’’ అని టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ మేటి స్పిన్నర్లు అని తెలిసిందే. దీంతో సచిన్ ఈ సూచన చేసినట్టుంది. భారత బౌలర్లకు ఓవల్ చక్కని వేదికగా సచిన్ అభిప్రాయపడ్డాడు. మరి తుది 11 మందిలో వీరిద్దరికీ టీమిండియా అవకాశం ఇస్తుందా? లేక ఒకరికి అవకాశం ఇచ్చి, సీమర్ల వైపు మొగ్గు చూపుతుందా? అనేది చూడాలి!


More Telugu News