'ఆదిపురుష్' ఈవెంటులో అందంగా మెరిసిన కృతి సనన్!
- అందరి దృష్టి 'ఆదిపురుష్' పైనే
- సీతాదేవి పాత్రను పోషించిన కృతి సనన్
- ఈవెంటులో బ్లాక్ శారీలో మెరిసిన నాయిక
- ఆమెను చూసేందుకు ఎగబడిన జనాలు
- ఆమె నటన పట్ల ప్రభాస్ ప్రశంసలు
కృతి సనన్ తెలుగు సినిమాతోనే కథానాయికగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. '1 నేనొక్కడినే' సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు ఆమె ఏ భాషలో కూడా ఏ సినిమా చేయలేదు. ఆ తరువాత కూడా ఆమె తెలుగులో 'దోచేయ్' చేసింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడం వలన, ఆమె పూర్తిగా బాలీవుడ్ సినిమాలపైనే దృష్టిపెట్టింది. బాలీవుడ్ లో గట్టిపోటీ ఉంటుంది .. అయినా ఆ పోటీని తట్టుకుంటూ, తనకంటూ ఆమె ఒక క్రేజ్ ను సంపాదించుకోగలిగింది. అలాంటి కృతి సనన్ 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా సీతాదేవి పాత్రలో కనిపించనుంది. సీతాదేవి పాత్ర చేసిన నాయికలకు సహజంగానే ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఈ నెల 16వ తేదీన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో కృతి సనన్ బ్లాక్ శారీలో అందంగా మెరిసింది. సీతాదేవి పాత్రను పోషించిన ఆమెను చూడటానికి జనాలు ఎగబడ్డారు. కృతి మంచి ఆర్టిస్ట్ కావడం వల్లనే ఈ పాత్రకి ఆమెను అనుకోవడం జరిగిందనీ, ఆమె పెర్ఫార్మెన్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని ప్రభాస్ ప్రశంసించడం విశేషం. సింపుల్ గా .. చక్కని చిరునవ్వుతో కనిపిస్తూ కృతి సనన్ మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి.