'ఆదిపురుష్' ఈవెంటుకి ప్రత్యేక ఆకర్షణ .. స్టేజ్ పై విల్లు ఎక్కుపెట్టిన ప్రభాస్!
- ఈ నెల 16న రిలీజ్ అవుతున్న 'ఆదిపురుష్'
- తిరుపతిలో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఇకపై ఎక్కువ సినిమాలు చేస్తానన్న ప్రభాస్
- తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానంటూ మాట
- హనుమంతుడికి ఒక సీటు వదిలిపెట్టామన్న దర్శకుడు
ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన 'ఆదిపురుష్' భారీ అంచనాల మధ్య ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంటుకి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ స్టేజ్ పై ప్రభాస్ విల్లు ఎక్కుపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ మాట్లాడుతూ .. "ఈ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నాకు అర్థమైంది .. ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయని అనుకుంటున్నాను. ఈ సినిమా కోసం 8 నెలలుగా ఎవరూ నిద్రపోలేదు .. ఓం రౌత్ మామూలు ఫైట్ చేయలేదు. అంతగా కష్టపడే డైరెక్టర్ ను నేను ఈ 20 ఏళ్లలో చూడలేదు. నేను ఈ సినిమా చేస్తున్నానని తెలిసి చిరంజీవిగారు ఒక మాట అన్నారు. రామాయణం చేసే అవకాశం అందరికీ రాదు .. నీ అదృష్టం .. నీకు వచ్చింది అన్నారు. నిజంగానే ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు.
కృతి సనన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక దేవ్ దత్ ను చూస్తుంటే నాకు నిజంగా ఆంజనేయస్వామిని చూస్తున్నట్టుగానే అనిపించింది. నన్ను ఎక్కువసేపు మాట్లాడమని అడుగుతున్నారు. తక్కువ మాట్లాడతాను .. ఎక్కువ సినిమాలు చేస్తాను. ఇందాకటి నుంచి పెళ్లి .. పెళ్లి అని అరుస్తున్నారు. ఎప్పటికైనా తిరుపతిలోనే చేసుకుంటాను .. సరేనా? అంటూ ముగించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రతి థియేటర్ లోను హనుమంతుడికి ఒక సీట్ వదిలేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఓం రౌత్ ఎమోషనల్ అయ్యారు. .
కృతి సనన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక దేవ్ దత్ ను చూస్తుంటే నాకు నిజంగా ఆంజనేయస్వామిని చూస్తున్నట్టుగానే అనిపించింది. నన్ను ఎక్కువసేపు మాట్లాడమని అడుగుతున్నారు. తక్కువ మాట్లాడతాను .. ఎక్కువ సినిమాలు చేస్తాను. ఇందాకటి నుంచి పెళ్లి .. పెళ్లి అని అరుస్తున్నారు. ఎప్పటికైనా తిరుపతిలోనే చేసుకుంటాను .. సరేనా? అంటూ ముగించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రతి థియేటర్ లోను హనుమంతుడికి ఒక సీట్ వదిలేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఓం రౌత్ ఎమోషనల్ అయ్యారు.