మూడు నుండి ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు
- వివిధ జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని పేర్కొన్న వాతావరణ శాఖ
- శనివారం వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
- గురు, శుక్రవారాల్లోను వివిధ ప్రాంతాల్లో వడగాలులు
రానున్న మూడు నుండి ఐదు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని పేర్కొంది. మంగళవారం నుండి బుధవారం ఉదయం వరకు అదిలాబాద్, కుమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలలో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని తెలిపింది.
రేపటి నుండి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పలు ప్రాంతాల్లో బుధవారం వడగాలులు వీస్తాయని వెల్లడించింది. గురు, శుక్రవారాల్లోను వివిధ ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.