కర్ణాటకలో ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 30న ఉప ఎన్నిక

  • పదవీకాలం ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎమ్మెల్సీ పదవులకు ముగ్గురి రాజీనామా
  • ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ
  • 30వ తేదీనే ఓట్ల లెక్కింపు
కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ముగ్గురు పదవీకాలం ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. పర్యవసానంగా ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా జూన్ 13న నోటిఫికేషన్, జూన్ 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న నామినేషన్ల పరిశీలన ఉంటాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువును జూన్ 23గా నిర్ణయించారు. జూన్ 30న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది.


More Telugu News