బ్రెజిల్ ఫుట్‌బాలర్ దిష్టిబొమ్మ దగ్ధం.. అభిమానులకు రూ.5 లక్షల జరిమానా
- బ్రెజిల్ నుండి అయిదేళ్ల క్రితం స్పెయిన్ కు వచ్చిన వినిసియస్ జూనియర్
- పలుమార్లు వివక్షను ఎదుర్కొన్న బ్రెజిల్ ఫుట్ బాలర్
- కళ్లముందే దిష్టిబొమ్మ దగ్ధం
- సీరియస్ గా తీసుకున్న కమిషన్ రూ.5 లక్షల జరిమానా విధింపు
బ్రెజిల్ స్టార్ అండ్ రియల్ మాడ్రిడ్ ఫుట్ బాలర్ వినిసియస్ జూనియర్ అభిమానుల నుండి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. మే 21వ తేదీన జరిగిన స్పానిష్ లీగ్ సందర్భంగా అభిమానులు అతని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంతేకాదు నీ దేశానికి వెళ్లిపో అని నినాదాలు చేశారు. అయితే స్పెయిన్ యాంటీ వయోలెన్స్ కమిషన్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. లైవ్ మ్యాచ్ సమయంలో ఒక సాకర్ ప్లేయర్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంతో పాటు దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు గాను వారికి 60,001 యూరోల జరిమానా, రెండేళ్ల నిషేధం విధించింది. ఈ జరిమానా మన కరెన్సీలో దాదాపు రూ.5 లక్షలు.
వినిసియస్ జూనియర్ అయిదేళ్ల క్రితం బ్రెజిల్ నుండి స్పెయిన్ కు వచ్చాడు. అప్పటి నుండి పలుమార్లు జాతి వివక్షను ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది జనవరిలో రియల్ మాడ్రిడ్, అట్లెటికో మాడ్రిడ్ మ్యాచ్ సందర్భంగా కూడా వివక్షను ఎదుర్కొన్నాడు. దీంతో స్పానిష్ క్లబ్ వాలెన్సియా ముగ్గురు అభిమానులకు ఏడాది పాటు స్టేడియంలోకి ఎంట్రీ లేకుండా శిక్షను విధించింది. ఇటీవల ఏడుగురు ఫ్యాన్స్ వినిసియస్ జూనియర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అతని కళ్ల ముందే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో చర్యలు తీసుకున్నారు.