'విరూపాక్ష' విషయంలో మెగా పేరు నిలబెట్టిన మేనల్లుడు!
- ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య'
- 48 కోట్ల వరకూ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా
- ఏప్రిల్ 21న విడుదలైన 'విరూపాక్ష'
- 25 కోట్ల వరకూ లాభాలు చూసిన సినిమా
- సాయితేజ్ కెరియర్లో ఈ సినిమా ఒక ప్రత్యేకం
ఈ ఏడాదిలో ఇంతవరకూ వచ్చిన సినిమాలలో ... ఈ ఆరు నెలలలో విజయవంతమైన సినిమాలలో మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' సినిమాతో పాటు, సాయితేజ్ 'విరూపాక్ష' కూడా ఉండటం విశేషం. బాబీ దర్శకత్వంలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' సినిమా ఈ ఏడాది జనవరి 12వ తేదీన విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ సందడి చేసింది.
తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, అక్కడి నుంచి నాన్ స్టాప్ వసూళ్లతో దూసుకుపోయింది. ఈ 6 నెలలలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. మెగాస్టార్ మరింత ఎనర్జిటిక్ గా కనిపించడంతో అభిమానులు మరింత ఖుషీ అయ్యారు. ఇక చాలా గ్యాప్ తరువాత సాయితేజ్ చేసిన 'విరూపాక్ష' ఏప్రిల్ 21వ తేదీన విడుదలైంది.
కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. కథాకథనాల పరంగా శభాష్ అనిపించుకుంది. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి అజనీశ్ లోక్ నాథ్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. 'వాల్తేరు వీరయ్య' 48 కోట్ల లాభాలను తెచ్చిపెడితే, 'విరూపాక్ష' 25 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఈ 6 నెలలలో మామయ్య వసూళ్లకి దగ్గరలో సాయితేజ్ నిలవడం విశేషంగానే చెప్పుకోవాలి.