ఎయిరిండియాలో సాంకేతిక సమస్య.. రష్యాలో అత్యవసర ల్యాండింగ్
- ఢిల్లీ నుండి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య
- రష్యాలోని మగడాన్ విమానాశ్రయంలో ల్యాండింగ్
- విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది
ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రష్యాలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని సదరు ఎయిర్‌లైన్స్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంజన్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ విమానాన్ని దారి మళ్లించామని, మగడాన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు తెలిపారు.
ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది ఎయిర్ ఇండియా సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా వారిని గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఆ సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది ఎయిర్ ఇండియా సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా వారిని గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.