కేసీఆర్ ఎన్నికల కోసం పని చేసే వ్యక్తి కాదు: కేటీఆర్

  • ఐటీ ఉత్పత్తులు మొదలు ఆహార ఉత్పత్తుల వరకు తెలంగాణ పురోగతి చెందిందన్న కేటీఆర్
  • గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఒకేసారి 51 పరిశ్రమల ప్రారంభం
  • 106 ఎకరాల స్థలంలో నిర్మించే టాయ్స్ పార్కుకు శంకుస్థాపన
ఐటీ ఉత్పత్తులు మొదలు ఆహార ఉత్పత్తుల దాకా తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపుర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఏకకాలంలో 51 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆయన ప్రారంభించారు. పలు కార్యాలయాలను కూడా ప్రారంభించారు. చిన్నారుల కోసం బొమ్మలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న టాయ్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు. రూ.156 కోట్లతో 106 ఎకరాల స్థలంలో ఈ పార్కు నెలకొల్పుతున్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమతౌల్య అభివృద్ధి జరుగుతోందన్నారు. తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల కోసం పని చేయడం కాకుండా, రేపటి తరం కోసం పని చేస్తాడన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. కాగా, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా అందుబాటులోకి రానుంది.


More Telugu News