ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌పై శుభ్‌మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- టీ20 ఫార్మాట్ తో పోలిస్తే టెస్టులు భిన్నమని వ్యాఖ్య
- ఐపీఎల్ లో అత్యుత్తమ ప్రతిభతో వచ్చిన ఆత్మవిశ్వాసం ఉపకరిస్తుందన్న గిల్
- వారం క్రితం వరకు డిఫరెంట్ గేమ్ ఆడం.. ఇప్పుడు టెస్ట్ ఆడబోతున్నామన్న శుభ్‌మన్
- టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తుంటే సరదాగా ఉందని వ్యాఖ్య
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌పై శుభ్ మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ఫార్మాట్ తో పోలిస్తే టెస్టులు విభిన్నంగా ఉంటాయని, ఐపీఎల్ లో అత్యుత్తమంగా ఆడటంతో వచ్చిన ఆత్మవిశ్వాసం తప్పకుండా ఉపకరిస్తుందని చెప్పాడు. టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తుంటే సరదాగా అనిపిస్తోందన్నాడు. వారం రోజుల క్రితం వరకు డిఫరెంట్ గేమ్ ఆడామని, ఇప్పుడు మాత్రం టెస్ట్ ఆడబోతున్నామన్నాడు. తమ ఎదుట ఓ కఠిన సవాల్ నిలిచిందని, టెస్ట్ క్రికెట్ కు ఎంత త్వరగా కుదురుగోగలమనేదే కీలకమన్నాడు.
న్యూజిలాండ్ తో జరిగిన తొలి డబ్ల్యుటీసీ ఫైనల్ మ్యాచ్ లో కూడా తాను భాగస్వామినయ్యానని, గత ఓటమి నుండి తప్పకుండా పాఠాలు నేర్చుకుంటామన్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ కు సంబంధించి ఎన్నో అంశాల్లో మెరుగ్గా ఉన్నట్లు చెప్పాడు.