బీసీ కులవృత్తులు, చేతివృత్తులకు తెలంగాణ ప్రభుత్వం రూ.1 లక్ష సాయం.. వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి!
- ఆర్థిక సాయానికి సంబంధించిన వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి గంగుల
- ఈ నెల 9న కేసీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభం
- దరఖాస్తుకు ఫోటో, ఆధార్, కుల ధ్రువీకరణ అవసరం
బీసీ కులవృత్తులు, చేతివృత్తులపై ఆధారపడిన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ప్రారంభించారు. ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 9న కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో రూ.1 లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభిస్తారు. అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలచే లబ్ధిదారులకు రూ.1 లక్ష పంపిణీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకోవడానికి ఫోటో, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం. పై వెబ్ సైట్ ద్వారా తక్షణమే దరఖాస్తు చేసుకోవచ్చు. కుల వృత్తి, చేతి వృత్తులకు సంబంధించిన పని ముట్లు, ముడి సరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు.
విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతి వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.1 లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు విధివిధానాలను రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.