కాంగ్రెస్ లో చేరుతున్న పొంగులేటి, జూపల్లి.. రాహుల్ టీమ్ చర్చలు సక్సెస్?
- కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన పొంగులేటి, జూపల్లి
- వీరి చేరికకు హైకమాండ్ లైన్ క్లియర్ చేసినట్టు సమాచారం
- రాహుల్ అమెరికా నుంచి వచ్చిన వెంటనే కార్యాచరణ మొదలయ్యే అవకాశం
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో సస్పెన్స్ కు తెరపడింది. బీజేపీలో చేర్పించేందుకు ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఈ ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతుండటం ఎన్నికలకు ముందు ఆ పార్టీలో ఫుల్ జోష్ నింపనుంచి.
వీరితో రాహుల్ టీమ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయని, వీరి చేరికకు కాంగ్రెస్ హైకమాండ్ లైన్ క్లియర్ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిద్దరికీ పార్టీ టికెట్లు ఇవ్వడంతో పాటు, వీరి అనుచరులకు కూడా టికెట్ల విషయంలో ప్రాధాన్యతను ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకున్నట్టు సమాచారం. వాస్తవానికి బీజేపీలో చేరాలా? లేక కాంగ్రెస్ లో చేరాలా? అనే సందిగ్ధతలో ఉన్న పొంగులేటి, జూపల్లి... కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరాలనే తుది నిర్ణయానికి వచ్చినట్టు చెపుతున్నారు. అయితే వీరి చేరికకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన వెంటనే కార్యాచరణ మొదలవుతుందని సమాచారం. ఇంకోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం అమెరికా పర్యటనలోనే ఉన్నారు.